తిరువళ్లూరులో 73 శాతం ఓటింగ్ | Sakshi
Sakshi News home page

తిరువళ్లూరులో 73 శాతం ఓటింగ్

Published Fri, Apr 25 2014 12:07 AM

తిరువళ్లూరులో 73 శాతం ఓటింగ్ - Sakshi

 తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలో 73 శాతం పోలింగ్ నమైంది. గురువారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మండుతున్న ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు బారులు తీరారు. తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలో గురువారం ఉదయం  7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.

అయితే మనవాలనగర్ ప్రాం తంలోని పోలింగ్ కేంద్రం, తోయుదావూర్ పోలింగ్ కేంద్రంతోపాటు దాదాపు పది పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ఆలస్యంగా ప్రారంభమయ్యూరు. ఈవీఎంలను మొరాయించడంతో ఎన్నికలు ఆల స్యంగా ప్రారంభమయ్యూరు. అయితే వాటిని సరి చేసిన అధికారులు పోలింగ్ ను ప్రారంభించారు.

మొదటి గంట సమయంలో పది శాతం ఓటింగ్ ప్రారంభమైనా, దాదాపు 12 గంటల వరకు 30 శాతం ఓటింగ్ దాటలేదు. అయితే మధ్యాహ్నం తరువాత వేగం పుంజుకుని 6 గంటల వరకు 73 శాతం నమోదైనట్లు అధికారులు  వెల్లడించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఓటరు స్లిప్పులు ఉన్నవారినే  లోపలికి అనుమతించారు. ఏజెంట్ ల వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


 సెండ్రాన్ పాళ్యం వద్ద గొడవలు: తిరువళ్లూరు జిల్లాలో అన్నాడీఎంకే, వీసీకే కార్యకర్తలు మధ్య గొడవలు చోటుచేసుకున్నారు. ఓటింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా, వీసీకే నేతలు వాటిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఇదే విధంగా రామంజేరి వద్ద అన్నాడీఎంకే నేతలు, డీఎంకే నేతల మధ్య గొడవ జరిగింది.

దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. డీఎంకే పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే రంగనాథన్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

ఇదే సమయంలో మంజాకుప్పం వద్ద ఓటర్లు తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించని రాజకీయ పార్టీలకు ఓటు వేసేది లేదని తేల్చి చెప్పడంతో అక్కడ సాయంత్రం వరకు కేవలం 20 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద  జనం లేక వెలవెలపోయింది. తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు తప్ప ప్రశాతంగా ముగిసింది.

Advertisement
Advertisement