‘ఐఐటీ–ఖరగ్‌పూర్‌’లో 121 నాన్‌ టీచింగ్‌ పోస్టులు | IIT Kharagpur in 121 non-teaching posts | Sakshi
Sakshi News home page

‘ఐఐటీ–ఖరగ్‌పూర్‌’లో 121 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Jan 18 2017 12:03 AM | Updated on Sep 5 2017 1:26 AM

‘ఐఐటీ–ఖరగ్‌పూర్‌’లో 121 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

‘ఐఐటీ–ఖరగ్‌పూర్‌’లో 121 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఖరగ్‌పూర్‌(పశ్చిమ బెంగాల్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.

ఖరగ్‌పూర్‌(పశ్చిమ బెంగాల్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఖాళీలతోపాటు గతంలో భర్తీ కాకుండా మిగిలిన (బ్యాక్‌లాగ్‌) పోస్టులూ ఉన్నాయి.

పోస్టుల వారీ వేకెన్సీ: అసిస్టెంట్‌ ఇంజనీర్‌/ఆర్కిటెక్ట్‌–1; ఎగ్జిక్యూటివ్‌–8; జూనియర్‌ ఇంజనీర్‌/ఆర్కిటెక్ట్‌–4; జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌–16; జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌–25; జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌–4; ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌–3; సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–2; మెడికల్‌ లేబొరేటరీ టెక్నీషియన్‌ (పాథాలజీ/రేడియోలజీ/ఫిజియోథెరపీ)–4; స్టాఫ్‌ నర్స్‌–5; అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2)–2; జూనియర్‌ టెక్నీషియన్‌/లేబొరేటరీ అసిస్టెంట్‌–36; జూనియర్‌ అసిస్టెంట్‌–6; సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌–2; డ్రైవర్‌(గ్రేడ్‌–2)–3.

వేతనం: అసిస్టెంట్‌ ఇంజనీర్‌/ఆర్కిటెక్ట్‌ నుంచి అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వరకు రూ.9,300–34,800+గ్రేడ్‌పే రూ.4,200. మిగిలిన పోస్టులకు రూ.5,200–20,200+గ్రేడ్‌పే రూ.2,000.
విద్యార్హత: ఎగ్జిక్యూటివ్‌: డిగ్రీ, సంబంధిత కొలువులో 8 ఏళ్ల అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం; జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా/డిగ్రీ/తత్సమానం, సీనియర్‌ టెక్నీషియన్‌గా 8 ఏళ్ల అనుభవం; జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: డిగ్రీ, సీనియర్‌ అసిస్టెంట్‌గా 8 ఏళ్ల అనుభవం. కంప్యూటర్‌ పరిజ్ఞానం; స్టాఫ్‌ నర్స్‌: ఇంటర్మీడియెట్, జీఎన్‌ఎం, ఏడాది అనుభవం; జూనియర్‌ టెక్నీషియన్‌/లేబొరేటరీ అసిస్టెంట్‌: డిగ్రీ(సైన్స్‌)/సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా, వైర్‌మ్యాన్‌ లైసెన్స్‌/పర్మిట్‌ ఉండాలి; జూనియర్‌ అసిస్టెంట్‌: డిగ్రీ, 40 డబ్ల్యూపీఎం వేగంతో కంప్యూటర్‌పై కంపోజింగ్‌ (టైపింగ్‌) చేయగలగాలి.

గరిష్ట వయోపరిమితి: పోస్టును బట్టి 30–45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, అప్లికేషన్‌ హార్డ్‌ కాపీని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే దరఖాస్తులను విడివిడిగా పంపాల్సి ఉంటుంది.  
చివరి తేది: ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు, హార్డ్‌ కాపీ పంపేందుకు: జనవరి 31
వెబ్‌సైట్‌: iitkgp.ac.in  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement