బయాలజీ | Sakshi
Sakshi News home page

బయాలజీ

Published Thu, Jan 16 2014 10:03 PM

బయాలజీ - Sakshi

సూక్ష్మజీవులు - వ్యాధులు

 లివెన్‌హుక్ 1674లో మొదటిసారి బ్యాక్టీరియాలను కనుక్కొన్నాడు. బ్యాక్టీరియాల గురించి చదివే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. లూయీపాశ్చర్ బ్యాక్టీరియాల ప్రాముఖ్యతను తెలిపాడు.  
 
 మానవుల్లో కలిగే బ్యాక్టీరియల్ వ్యాధులు
 
 కలరా:
 బ్యాక్టీరియా పేరు: విబ్రియోకలరా
 వ్యాధి లక్షణాలు: దేహ నిర్జలీకరణం, కళ్లు గుంటలు పడటం, కండరాల నొప్పులు
 సంక్రమణ: కలుషిత ఆహారం, నీరు
 టైఫాయిడ్:
 బ్యాక్టీరియా పేరు: సాల్మోనెల్లాటైఫీ
 వ్యాధి లక్షణాలు: జ్వరం, తలభారం, పొట్టభాగం పచ్చిగా ఉండటం
 సంక్రమణ: కలుషిత నీరు, పాలు, ఆహారం
 డిప్తీరియా:
 బ్యాక్టీరియా పేరు: కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా
 వ్యాధి లక్షణాలు: తీవ్ర గొంతునొప్పి
 సంక్రమణ: ప్రత్యక్ష తాకిడివల్ల
 కోరింతదగ్గు/పెర్టుసిస్:
 బ్యాక్టీరియా పేరు: బోర్థిటెల్లా పెర్టుసిస్
 వ్యాధి లక్షణాలు: ‘వూఫ్’ అనే శబ్దంతో దగ్గు, శ్లేష్మం
 సంక్రమణ: తుంపరల ద్వారా
 టెటానస్/ధనుర్వాతం:
 బ్యాక్టీరియా పేరు: క్లాస్ట్రీడియం టెటానై
 వ్యాధి లక్షణాలు: మెడ, దవడ కండరాలు బిగుసుకుపోవడం
 సంక్రమణ: తుప్పుపట్టిన సూదులు గుచ్చుకున్నప్పుడు
 క్షయ/టీబీ:
 బ్యాక్టీరియా పేరు: మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌కులోసిస్
 వ్యాధి లక్షణాలు: శ్వాసకోశాలు ప్రభావితం కావడం, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు
 సంక్రమణ: ప్రత్యక్ష తాకిడి, తక్కువ వెలుతురు గదుల్లో నివసించడం వల్ల
 కుష్ఠు:
 బ్యాక్టీరియా పేరు: మైకోబ్యాక్టీరియం లెప్రె
 వ్యాధి లక్షణాలు: వ్యాధిసోకిన భాగాలు స్పర్శను కోల్పోవడం(వేళ్ల చివరి భాగాలు)
 సంక్రమణ: అంటువ్యాధి కాదు, (దీర్ఘకాల సన్నిహిత సంబంధం వల్ల వ్యాప్తి చెందుతుంది)
 బొటులిజం(ఫుడ్ పాయిజన్):
 బ్యాక్టీరియా పేరు: క్లాస్ట్రీడియం బొటులినం
 వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు
 సంక్రమణ: పంకిలమైన ఆహారం వల్ల
 న్యుమోనియా:
 బ్యాక్టీరియా పేరు: డిప్లోకోకస్ న్యుమోనియా
 వ్యాధి లక్షణాలు: ఛాతిలో నొప్పి, ఆయసం
 సంక్రమణ: గాలి ద్వారా
 ప్లేగు:
 బ్యాక్టీరియా పేరు: అర్సినియాపెస్టిస్
 వ్యాధి లక్షణాలు: జ్వరం, చర్మంమీద నల్లటి మచ్చలు
 సంక్రమణ: ఎలుకల ద్వారా మానవునికి
 సిఫిలిస్:
 బ్యాక్టీరియా పేరు: ట్రెపోనిమా పాలిడమ్
 వ్యాధి లక్షణాలు: జననాంగాలపై పుండ్లు
 సంక్రమణ: అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల

Advertisement
 
Advertisement
 
Advertisement