అవిశ్రాంత విప్లవయోధుడు తరిమెల | tarimela nagi reddy 102 birth anniversary | Sakshi
Sakshi News home page

అవిశ్రాంత విప్లవయోధుడు తరిమెల

Feb 11 2015 12:18 AM | Updated on Sep 2 2017 9:06 PM

అవిశ్రాంత విప్లవయోధుడు తరిమెల

అవిశ్రాంత విప్లవయోధుడు తరిమెల

విప్లవోద్యమంలో మెరిసిన వజ్రకరూరు వైఢూర్యం తరిమెల నాగిరెడ్డి. ఆయన విప్లవం కోసం జీవించాడు, విప్లవం కోసం శ్రమించాడు, విప్లవం కోసం కృషి చేస్తూ మరణించాడు.

విప్లవోద్యమంలో మెరిసిన వజ్రకరూరు వైఢూర్యం తరిమెల నాగిరెడ్డి. ఆయన విప్లవం కోసం జీవించాడు, విప్లవం కోసం శ్రమించాడు, విప్లవం కోసం కృషి చేస్తూ మరణించాడు. 1917 ఫిబ్రవరి 11న అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం తరిమెల గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించిన తరిమెల నాగిరెడ్డి జీవితం యావత్తూ స్వాతంత్య్ర పోరాటంతో, కమ్యూనిస్టు, విప్లవోద్యమాలతో పెనవేసుకుపోయింది.

చిన్నతనం నుంచే జాతీయో ద్యమ ప్రభావానికి ఆయన గురయ్యారు. 1932-33 లో బనారస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ తరిమెల తొలిసారిగా మార్క్సి జాన్ని అధ్యయనం చేశారు. 1939లో కమ్యూనిస్టు పార్టీ సభ్యులైనారు. 1940లో ‘యుద్ధం- దాని ఆర్థిక ప్రభావం’ పుస్తకాన్ని ప్రచురించినందుకు ఒకటిన్న రేళ్లు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. 1946-49 మధ్య రహస్య జీవితం గడిపారు. 1952 లో జైల్లోంచే, బావ నీలం సంజీవరెడ్డిపై పోటీ చేసి అనంతపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1969 మార్చిలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఏపీ శాసనసభలో సంచలనాత్మక ప్రసం గం చేశారు. 1970-72లో జైలులోనే ‘తాకట్టులో భారతదేశం’రచించారు. 1975లో దేవులపల్లి వెంకటేశ్వర రావుతో కలసి యూసీసీఆర్‌ఐ (ఎం-ఎల్)ను స్థాపించి విప్లవోద్యమంలోని అతి వాద, మితవాద ధోరణులను వ్యతిరేకించారు. అవిశ్రాంత విప్లవ యోధుడు 1976, జూలై 28న హైదరాబాద్‌లో కన్ను మూశారు. ప్రజల కోసం పనిచేయడం, వారికోసం మరణించడం హిమాల యాలకంటే ఎతై్తనది అనే సూక్తిని అక్షరాలా నిజం చేసిన విప్లవమూర్తి తరిమెల నాగిరెడ్డి.

(నేడు తరిమెల నాగిరెడ్డి 102వ జన్మదినం)
-సి. భాస్కర్‌ యూసీసీఆర్‌ఐ (ఎం-ఎల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement