గ్రహం అనుగ్రహం ( 21-07-2015 ) | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం ( 21-07-2015 )

Jul 20 2015 11:31 PM | Updated on Sep 3 2017 5:51 AM

గ్రహం అనుగ్రహం ( 21-07-2015 )

గ్రహం అనుగ్రహం ( 21-07-2015 )

గ్రహం అనుగ్రహం

శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం
తిథి శు.పంచమి ప.12.44 వరకు, తదుపరి షష్ఠి
నక్షత్రం ఉత్తర రా.1.21 వరకు
వర్జ్యం ఉ.6.29 నుంచి 8.10 వరకు
దుర్ముహూర్తం ఉ.8.12 నుంచి 9.02 వరకు
తదుపరి రా.11.00 నుంచి 11.47 వరకు
అమృతఘడియలు సా.5.07 నుంచి 6.47 వరకు
 
సూర్యోదయం    : 5.39
సూర్యాస్తమయం:     6.34
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
 మేషం: ఆకస్మిక ధన, వస్తు లాభాలు. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 వృషభం: మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. వ్యయ ప్రయాసలు. మానసిక అశాంతి. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి.
 మిథునం: పనుల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 కర్కాటకం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల స్థితి.
 సింహం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
 కన్య: నూతన వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహన, గృహ యోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 తుల: వ్యయ ప్రయాసలు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది.
 వృశ్చికం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధన లాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పనులు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లాభిస్తాయి.
 మకరం: రుణాలు చేస్తారు. ఆలోచనలు  నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. పనులు వాయిదా పడవచ్చు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి.
 కుంభం: ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
 మీనం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
 
Advertisement
Advertisement