సురక్షిత బడిబాట

Editorial About Dilema Of Schools Reopening After Coronavirus - Sakshi

ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు అసాధారణమైనవి. ప్రభుత్వాలు అన్ని రంగాల్లో పెను సవాళ్లు ఎదుర్కొనవలసి వస్తోంది. ప్రజారోగ్య, సామాజిక, ఆర్థిక రంగాల సమస్యలతోపాటు పాఠశాల విద్యను మళ్లీ పట్టాలెక్కించడం కూడా సమస్యే. కరోనా వైరస్‌ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి తెరిపినపడటానికి చేసే ప్రయత్నాలను పరిహసిస్తూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ నియంత్రణలోకొచ్చాక తిరిగి ప్రారంభం కావాల్సిన కార్యకలాపాల్లో చదువులు అన్నిటి కన్నా ముఖ్యమైనవి. దాన్ని దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు తిరిగి తెరవడంపైనా... ఈ విషయంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ నెల 15న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

ఎవరు ఏ తేదీకి బడులు తెరవడానికి సంసిద్ధంగా ఉన్నారో చెప్పాలని సూచించింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో ఎటూ చెప్పలేకపోయాయం టేనే వర్తమానంలో వైరస్‌ తీవ్రత ఎంత వుందో అర్థమవుతుంది. ఒక్క అస్సాం మాత్రం ఈ నెలా ఖరున పాఠశాలలు తిరిగి తెరిస్తే బాగుంటుందని చెప్పగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, నాగాలాండ్, రాజస్తాన్, అరుణచల్‌ ప్రదేశ్, ఒడిశా, లదాఖ్‌లు సెప్టెంబర్‌ నెలలో ప్రారంభించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ, హరియాణ, బిహార్, చండీగఢ్‌ ఆగస్టులో పాఠశాలలు తెరిస్తే బాగుంటుందని సూచించాయి. తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌ తదితర 21 ప్రభుత్వాలు నిర్దిష్టంగా చెప్పలేకపోయాయి. 

పాఠశాలలన్నీ నాలుగు నెలలుగా నిరవధికంగా మూతబడి వుండటం వల్ల దేశవ్యాప్తంగా 25 కోట్లమంది పిల్లలు చదువులకు దూరమయ్యారు. కొన్ని రాష్ట్రాలు ఏదో ఒక మేర దూరవిద్య విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. కానీ దాని ద్వారా లబ్ధి పొందుతున్న పిల్లల శాతం తక్కువే. ఇంటర్నెట్‌ సదుపాయం అంతంతమాత్రంగా వుండటం, అలాంటి సదుపాయం వున్నా ఖరీదైన ఉపకరణాలను కొనుక్కునే స్తోమత చాలామంది పిల్లలకు లేకపోవడం పర్యవసానంగా ఆన్‌లైన్‌ చదువులు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఒక తరం చదువులకు దూరమైతే పిల్లలకు మాత్రమే కాదు... సమాజానికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. దాన్నుంచి కోలుకోవడం కష్టమవుతుంది. అలాగని వైరస్‌ మహమ్మారి శాంతించకుండా చదువులు మొదలుపెడితే పర్యవసానాలు తీవ్రంగా వుండే ప్రమాదముంటుంది. ఇప్పుడున్న స్థితిలో పిల్లలు ముప్పు బారిన పడకుండా చూడటం అతి ముఖ్యం.

రాష్ట్ర ప్రభుత్వాల సిలబస్‌లు చాలావరకూ బోధనకు పరిమితమై ఉంటాయి. తరగతి గదిలోని పిల్లలకు టీచర్‌ వచ్చి బోధించడం, పాఠ్యాంశాలపై అవగాహన కలి గించడం, వారి సందేహాలు తీర్చడం వగైరాలు అందులోవుంటాయి. ఐబీ, ఐజీసీఎస్‌ఈ వంటివి ఇందుకు భిన్నం. అందులో పిల్లలు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, చర్చించుకోవడం ఒక భాగం. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి తమకిచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి లేదా ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. టీచర్ల సాయం తీసుకుంటారు. ఇక ఆటపాటలు సరేసరి. ఇప్పు డున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయా? విద్యార్థుల మధ్య ఆరేసి అడుగుల దూరం వుండేలా చూడటం, వారు చెట్టపట్టాలు వేసుకోకుండా చూడటం తప్పనిసరి. పిల్లలు భౌతికదూరం పాటిం చేలా చూడటం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా విశా లమైన తరగతి గదుల నిర్మాణం ఎలా?  తరగతి గదికి వచ్చాక కాదు... బస్సులోనో, మరో వాహనం లోనో బడికి వస్తున్నప్పుడూ, తిరిగి ఇళ్లకు వెళ్తున్నప్పుడు వారితో పాటింపజేయాల్సినవేమిటి? అనారోగ్యం బారిన పడిన పిల్లలు బడికి రాకుండా తల్లిదండ్రులు ఏదోమేరకు జాగ్రత్తలు తీసుకుంటా రనుకున్నా, ఆ పిల్లలు బడికి వచ్చాక సమస్య బయటపడిన పక్షంలో ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? వారిని మళ్లీ సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడం, ఆ పిల్లలకు సకాలంలో వైద్యం అందేలా చూడటం ముఖ్యం గనుక అందుకు అదనపు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది.

ఈ ఏర్పాట్ల కోసం ఎన్నో వ్యయప్రయాసలు తప్పవు. అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి తీసుకు రావాల్సివుంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం వుంటోంది. ఆ సదుపాయాన్ని కొనసాగించడంలో పాటించాల్సిన జాగ్రత్తలేమిటో చూసుకోవాలి. అలాగే కొత్తగా కేసులు బయటపడినచోట పాఠశాలలు మూతబడక తప్పదు. అప్పుడు ఇతర పాఠ శాల విద్యార్థులతోపాటు వారు కూడా చదువుల్లో ముందుండటానికి ఏం చేయాలో ఆలోచించాలి.  

ఈ కష్టకాలంలో పిల్లల్లో సహజంగానే భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. తమ ఇంట్లోనో, తమ పొరుగునో సమస్యల్లో చిక్కుకున్నవారి గురించి విని భయాందోళనలతో వుంటారు. దానికి తోడు మునుపటిలా కదలికలుండవు గనుక ఒక రకమైన అసౌకర్యానికి గురవుతారు. తోటి పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఇవన్నీ మరింతగా పెరుగుతాయి. కనుక సిలబస్‌ పూర్తి చేయాలన్న తొందరలో టీచర్లు ఒత్తిళ్లు తీసుకురాకూడదు. అసలు బోధనావిధానమే సంపూర్ణంగా మార్చు కోవాల్సి ఉంటుంది.  బడులు తెరవడం అంటే వీటన్నిటి విషయంలో సర్వసన్నద్ధంగా వుండటం. చాలా రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రభుత్వాలు బడుల్ని నిరాదరిస్తూ వస్తున్నాయి. మెజారిటీ పాఠశాలల్లో మిగిలిన సదుపాయాల మాట అటుంచి సురక్షితమైన తాగునీరు లభ్యత కూడా లేదు.

ఈ కరోనా కష్టకాలంలో కూడా అవే పరిస్థితులు కొనసాగితే విద్యార్థులను ముప్పు బారిన పడేసినట్టే. ఇప్పుడే ర్పడిన ఈ అసాధారణ పరిస్థితులకు అనుగుణంగా పాత విధానాలన్నీ సవరించుకోవడం, ప్రభావ వంతంగా బోధించి పిల్లలు విద్యాపరంగా వెనకబడకుండా చూడటం, అవసరమైన సదుపాయాలు అందుబాటులో వుంచడం పాఠశాలల ముందున్న పెను సవాలు. ఆ సవాలును ఎదుర్కొనగలిగే సత్తా ఉన్నప్పుడే పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడం సాధ్యం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

29-11-2020
Nov 29, 2020, 09:46 IST
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్‌ రావడం...
29-11-2020
Nov 29, 2020, 04:37 IST
సాక్షి, హైదరాబాద్, మేడ్చల్‌: దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా...
28-11-2020
Nov 28, 2020, 20:28 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625...
28-11-2020
Nov 28, 2020, 20:25 IST
సాక్షి, అమరావతి: ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అని సామెత. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న గణిత శాస్త్రవేత్తలకు ఇప్పుడీ సామెత...
28-11-2020
Nov 28, 2020, 18:55 IST
కంపెనీలు ప్రకటిస్తున్న ఏ కరోనా వ్యాక్సిన్లను తీసుకోమంటూ కొంత మంది దేశాధినేతలే ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది.
28-11-2020
Nov 28, 2020, 17:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే....
28-11-2020
Nov 28, 2020, 16:42 IST
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన నాలుగు వారాల్లోనే ఢిల్లీ వాసులందరికి అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్...
28-11-2020
Nov 28, 2020, 16:06 IST
భోపాల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది....
28-11-2020
Nov 28, 2020, 15:38 IST
వ్యాక్సిన్ల పనితీరును అంచనా వేయడానికి ఓ చిత్రమైన మేథమెటికల్‌ ఫార్ములాను అమలు చేస్తున్నారు.
28-11-2020
Nov 28, 2020, 15:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  భారత్‌ బయోటెక్‌ పర్యటన ముగిసింది. మూడు నగరాల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చని...
28-11-2020
Nov 28, 2020, 15:28 IST
సిమ్లా: కరోనా వ్యాప్తి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమాలు తెచ్చినా.. కొందరు జనాలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోరు....
28-11-2020
Nov 28, 2020, 11:13 IST
మహారాష్ట్ర: కరోనా బారిన పడి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే మరణించారు. పుణేలోని రబీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి...
28-11-2020
Nov 28, 2020, 08:23 IST
బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి మరో కొత్త విషయం బయటపడింది. శరీరం మొత్తం వ్యాపించేందుకు కరోనా వైరస్‌ మన...
28-11-2020
Nov 28, 2020, 04:53 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి...
28-11-2020
Nov 28, 2020, 04:26 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు...
28-11-2020
Nov 28, 2020, 03:27 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ముందు చూపుతో వ్యవహరించి వైరస్‌...
27-11-2020
Nov 27, 2020, 17:34 IST
న్యూఢిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్‌ డీల్‌ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు...
27-11-2020
Nov 27, 2020, 13:50 IST
మాస్కో/ హైదరాబాద్‌: దేశీయంగా రష్యన్‌ వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్‌ డైరెక్ట్‌...
27-11-2020
Nov 27, 2020, 11:47 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 కోవిడ్‌...
27-11-2020
Nov 27, 2020, 10:44 IST
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top