నయీం జాడ ఎలా దొరికిందంటే..? | zptc husband complaints against gangster nayeem in july | Sakshi
Sakshi News home page

నయీం జాడ ఎలా దొరికిందంటే..?

Aug 8 2016 5:49 PM | Updated on Oct 16 2018 9:08 PM

నయీం జాడ ఎలా దొరికిందంటే..? - Sakshi

నయీం జాడ ఎలా దొరికిందంటే..?

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జెడ‍్పీటీసీ భర్త గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదుతో గ్యాంగ్స్టర్ నయీం పోలీసులకు దొరికిపోయాడు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జెడ‍్పీటీసీ భర్త గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదుతో గ్యాంగ్స్టర్ నయీం జాడ పోలీసులకు దొరికింది. ఫోన్ కాల్స్ను ట్రాక్ చేసి నయీం షాద్ నగర్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

కోటి రూపాయలు ఇవ్వాలంటూ నయీం ముఠా గత జూలైలో గంగాధర్ను బెదిరించింది. దీంతో ఆయన గత నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయీం ముఠా కదిలికలపై నిఘా వేయడంతో పాటు ఫోన్ కాల్స్ను ట్రాక్ చేశారు. వాళ్లు షాద్ నగర్లో ఉన్నట్టు పక్కాగా సమాచారం వచ్చింది. నయీం ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతని అనుచరుడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నయీం హతమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement