ప్రతిష్టాత్మకంగా జిల్లా ప్లీనరీ | ysr cp district pleanery | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా జిల్లా ప్లీనరీ

Jun 22 2017 11:50 PM | Updated on May 29 2018 4:37 PM

వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీని ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు అజెండాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. విశాఖలో చేపట్టిన మహాధర్నాకు విచ్చేసిన జిల్లాపార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, సీఈసీ సభ్యులు పినపే

కాకినాడ :

 వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీని ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు అజెండాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. విశాఖలో చేపట్టిన మహాధర్నాకు విచ్చేసిన జిల్లాపార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, సీఈసీ సభ్యులు పినపే విశ్వరూప్, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, ఇతర ముఖ్యనేతలతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ నెల 29వ తేదీన జరగనున్న ప్లీనరీకి జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో మాజీమంత్రి కొప్పన మోహనరావు, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పెండెం దొరబాబు, తోట సుబ్బారావునాయుడు వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, గిరిజాల బాబు, పితాని బాలకృష్ణ,కొండేటి చిట్టిబాబు, ముత్యాలశ్రీనివాస్, పర్వత ప్రసాద్, అమలాపురంపార్లమెంట్‌కో–ఆర్డినేటర్‌ వలవల బాబ్జి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండకుదిటి మోహన్‌ తదితరులు ఉన్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement