వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మంగళవారం జిల్లాలో చేపట్టిన రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది.
వరంగల్:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మంగళవారం జిల్లాలో చేపట్టిన రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. పరామర్శయాత్రలో భాగంగా ఆమె జనగామ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించారు. జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రంలోని గుడిసెల లచ్చవ్వ, అలువాల యాదగిరి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఇదే మండలంలోని పోచన్నపేటలోని నేలపోగుల యాదగిరి ఇంటికి వెళ్లి పరామర్శించారు. తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలోని గాదె శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని వల్లాల లక్ష్మయ్య కుటుంబానికి, ఇదే మండలంలోని తాటికొండలోని ఎడమ మల్లయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.. చివరగా కిష్టాజిగూడెంలోని జక్కుల కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
పరామర్శయాత్రలో వైఎస్ షర్మిలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం స్టేషన్ ఘనపూర్, వర్థన్నపేట నియోజకవర్గాల్లో షర్మిల పరామర్శయాత్ర కొనసాగనుంది. తొలి రెండు రోజులు 14 కుటుంబాలను పరామర్శించిన షర్మిల.. రేపు మరో ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు.