వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (సోమవారం) గుంటూరు జిల్లాలోని మాచర్లలో జరిగే ధర్నాలో పాల్గొననున్నట్టు వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు.
గుంటూరు: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (సోమవారం) గుంటూరు జిల్లాలోని మాచర్లలో జరిగే ధర్నాలో పాల్గొననున్నట్టు వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి రేపు ఉదయం 10 గంటలకు మాచర్లకు వైఎస్ జగన్ చేరుకోనున్నట్టు చెప్పారు.
మాచర్ల ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేలాది మంది ప్రజలతో కలిసి వైఎస్ జగన్ ధర్నా చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు, తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వైఎస్ జగన్ ధర్నా చేపడుతున్నట్టు తలశిల రఘురామ్ పేర్కొన్నారు.