నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నీరు–చెట్లు పనులు నిబంధనలకు అనుగుణంగానే చేపట్టాలని ఇరిగేషన్ శాఖ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ వీ కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక హరనాథపురం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోని ఎస్‌ఈ చాంబర్‌లో ఈఈలు, డీఈలు, ఏఈలతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
-
ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నీరు–చెట్లు పనులు నిబంధనలకు అనుగుణంగానే చేపట్టాలని ఇరిగేషన్ శాఖ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ వీ కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక హరనాథపురం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోని ఎస్‌ఈ చాంబర్‌లో ఈఈలు, డీఈలు, ఏఈలతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నీరు–చెట్టు పనులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు చెక్‌పెట్టి డిపార్ట్‌మెంట్ పరువును కాపాడాలని పలు సూచనలు చేశారు. మూడో విడత నీరు– చెట్టు పనులను ప్రారంభించకముందే రెండో విడత పనులను పూర్తి చేయాలన్నారు. మూడో విడత నీరు –చెట్టు పనులను పర్యవేక్షించేందుకు డ్వామా పీడీ హరితను కలెక్టర్ నియమిం చినట్లు తెలిపారు. ప్రత్యక్షంగా పనులు అవసరమున్న ప్రాంతాలను పరిశీలించి ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రణాళికల్లో తేడాలు వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.