అద్భుతం... మదర్‌ థెరిసా నాటకం

అద్భుతం... మదర్‌ థెరిసా నాటకం

పెదవాల్తేరు :  రంగస్థలంపై అద్భుతం అవిష్కతమైంది. వెండితెరను తలపించే సెట్టింగ్‌లతో ప్రేక్షక లోకాన్ని మైమరపించింది. రెండు గంటల పాటు తమ నాటన కౌశలంతో నటీనటులు నాటకాన్ని రక్తికట్టించారు. కోల్‌కతా మురికవాడల్లో అమతమూర్తి ‘మదర థెరిసా’ చేసిన సేవలను కళ్ల కట్టినట్టుగా ఆవిష్కరించి విశాఖ కళాప్రియుల మన్ననలు అందుకున్నారు.  సికింద్రాబాద్‌కు చెందిన యాక్మి లయోలా ఓల్డేజ్‌ హోమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పోర్టు కళావాణి ఆడిటోరియంలో  మదర్‌  థెరిసా నాటకాని ప్రదర్శించారు. అమతవాణి సమర్పణలో బాలశౌరి దర్శకత్వంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మ్యూజిక్‌ను అందించారు. 

–మదర్‌పాత్రతో లీనమై ప్రేక్షకులను కట్టిపడేసిన శ్రీజ సాధినేని 

చావైనా బతుకైనా హుందా ఉండాలని విశ్వసించిన విశ్వమాత మదర్‌ థెరిసా. మానవత్వానికి ప్రతిరూపం ఆమె. అభాగ్యులను ఆదుకుని పట్టెడన్నం పెట్టేందుకు ఆమె పడిన శ్రమ విశ్వవ్యాప్తంగా స్ఫూర్తిని నింపింది.  ఈ నాటకంలో మదర్‌ థెరిసా పాత్రధారిగా శ్రీజ సాధినేని తన నటనా చాతుర్యంతో ప్రేక్షకుల హదయాలను దోచుకున్నారు. తన హావభావాలతో పాత్రకు రక్తి కట్టించి ప్రేక్షకులను కట్టిపడేశారు. కోల్‌కతా మురికివాడలో  కలరా వ్యాధితో అల్లాడుతున్న వారికి మదర్‌ సేవలందించే నటనలో ప్రేక్షకులను హదయాలను కదిలించారు. జన నీరాజనాలు అందుకున్నారు. 

రెండు గంటల నిడివి.. 22 సెట్టింగ్‌లు 

ఇంత వరకు సురభి నాటకాల సెట్టింగ్‌లు చూసిన విశాఖ వాసులకు మదర్‌థెరిసా నాటకం మరో అద్భుతాన్ని రుచిచూపింది. ఏకంగా కోల్‌కతా హౌరాబ్రిడ్జి బ్యాక్‌డ్రాప్‌ను సెట్టింగ్‌ వేశారు. వేదికపైకి నిజంగా ట్రైన్‌ వచ్చిందా అన్నట్టుగా వేసిన సెట్టింగ్‌తో కళాకారులు ప్రశంసలుపొందారు. సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌ సెట్, అక్కడ ఉండే పెద్ద గేట్‌ను సెట్‌ ద్వారా చూపించారు. కోల్‌కతా మురికివాడలను సెట్‌ను సైతం వేసి నాటకానికి వన్నెతెచ్చారు. నాటకం మొత్తానికి  22 సెట్టింగ్‌లు అదరహో అనిపించాయి. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఈ నాటకానికి బ్యాక్‌డ్రాప్‌ మ్యూజిక్‌  అందించి సన్నివేశానికి తగ్గట్టు రక్తికట్టించారు. మదర్‌ థెరిసా నాటకానికి సంగీతం సమకూర్చే అదష్టం కలగడం పూర్వజన్మసుకతం. విశ్వమాత నాటకానికి పనిచేయడం నా జన్మలో గొప్ప విషయంగా భావిస్తున్నానని సంగీతం అందించిన సినీ సంగీత దర్శకుడు  అనురూప్‌ రూబెన్స్‌ వ్యాఖ్యానించారు. పలువురు ప్రముఖులు ఈ నాటకాన్ని తిలకించారు.

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top