నరసరావుపేటటౌన్ : ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది.
మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ
Aug 4 2016 6:56 PM | Updated on Sep 4 2017 7:50 AM
నరసరావుపేటటౌన్ : ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం ఐలా బజార్‌లో నివాసముంటున్న చింతా మల్లేశ్వరి గురువారం ఇంటి బయట తన పిల్లల్ని ఆడిస్తుండగా వెనుకగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఆగంతకుల్లో ఒకరు ఆమె మెడలో గొలుసును తెంచుకొని ఉడాయించారు. బాధితురాలు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు దుండగులను వెంబడించినా ఫలితం దక్కలేదు. జరిగిన సంఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు తెలిపింది.
Advertisement
Advertisement