దేవరపల్లి మండలం యాదవోలులో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఎస్‌ఐ సి.హెచ్.ఆంజనేయులు కథనం ప్రకారం.. ద్వారకా తిరుమల మండలం గొడుగుపేటకు చెందిన వెంకటలక్ష్మి(25) యాదవోలుకు చెందిన గుంపుల శ్రీనును ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది.
మహిళ అనుమానాస్పద మృతి
Aug 28 2016 12:21 AM | Updated on Sep 4 2017 11:10 AM
దేవరపల్లి : దేవరపల్లి మండలం యాదవోలులో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఎస్‌ఐ సి.హెచ్.ఆంజనేయులు కథనం ప్రకారం.. ద్వారకా తిరుమల మండలం గొడుగుపేటకు చెందిన వెంకటలక్ష్మి(25) యాదవోలుకు చెందిన గుంపుల శ్రీనును ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి శనివారం ఇంటిలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు వెల్లడించారు.
Advertisement
Advertisement