మహిళ ఆత్మహత్య | woman suicides in bodabanda | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Sep 29 2016 11:27 PM | Updated on Sep 4 2017 3:31 PM

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బోడబండ తండాకు చెందిన వెంకటమ్మ(28)అనే మహిళ కడుపునొప్పి తాళలేక గురువారం ఆత్మహత్య చేసుకుంది.

గుత్తి రూరల్‌ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బోడబండ తండాకు చెందిన వెంకటమ్మ(28)అనే మహిళ కడుపునొప్పి తాళలేక గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడబండ గ్రామానికి చెందిన వెంకటమ్మ  కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుండేది.  వైద్యం చేయించినా నయం కాకపోవడంతో  జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. 

అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కు కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement