వంటచేస్తూ.. మహిళ సజీవ దహనం | Woman burned alive | Sakshi
Sakshi News home page

వంటచేస్తూ.. మహిళ సజీవ దహనం

Apr 21 2016 1:40 PM | Updated on Oct 17 2018 6:06 PM

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఎగిసి పడిన మంటల్లో ఓ మహిళ సజీవ దహనం అయింది.

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఎగిసి పడిన మంటలు ఒక్కసారిగా పూరిగుడిసెకు అంటుకోవడంతో.. ఓ మహిళ సజీవ దహనం అయింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

 స్థానికంగా నివాసముంటున్న సాయవ్వ(54) ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడి గుడెసెకు అంటుకోవడంతో.. అందులో చిక్కుకొని సజీవ దహనం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement