భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావట్లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అశ్వరావుపేట(కొత్తగూడెం): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావట్లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి నాగరాజు(23)కు ఏడాది క్రితం వివాహమైంది.
భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతుండటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఎన్ని రోజులైన భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపానికి గురైన నాగరాజు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.