'ముద్రగడతో చర్చలకు వెళ్లడం లేదు' | we will discuss issue with Thota thrimurthulu | Sakshi
Sakshi News home page

'ముద్రగడతో చర్చలకు వెళ్లడం లేదు'

Feb 4 2016 8:37 PM | Updated on Sep 3 2017 4:57 PM

'ముద్రగడతో చర్చలకు వెళ్లడం లేదు'

'ముద్రగడతో చర్చలకు వెళ్లడం లేదు'

కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టనున్న కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలిపారు.

రాజమండ్రి: కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టనున్న కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో మాట్లాడతామని  టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కేవలం దీక్ష విరమించాలని ఆయనకు సూచించేందుకు మాత్రమే ఆయనను కలవనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ జీవోల ద్వారా కాపులకు రిజర్వేషన్లు కల్పించినా న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. కమిషన్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తేనే వేటికైనా న్యాయం జరుగుతుందని టీడీపీ నేత అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని శుక్రవారం ఉదయం ఆమరణ దీక్ష చేపట్టనున్న ముద్రగడ పద్మనాభానికి నచ్చచెబుతామని తోట త్రిమూర్తులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement