మెరుగైన ఫలితాలు సాధించాలి | we must get good results | Sakshi
Sakshi News home page

మెరుగైన ఫలితాలు సాధించాలి

Aug 6 2016 6:16 PM | Updated on Sep 4 2017 8:09 AM

క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని శ్రీహిందూ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ పనకంటి భాస్కర్‌రావ్‌ విద్యార్థులకు సూచించారు.

రామన్నపేట
క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని శ్రీహిందూ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ పనకంటి భాస్కర్‌రావ్‌ విద్యార్థులకు సూచించారు. శనివారం శ్రీహిందూ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమసంవత్సరం విద్యార్థులకు ఉచితంగా స్టడీమెటీరియల్‌ను అందజేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదువలేదన్నారు.  పేదవిద్యార్థులకు కళాశాల యాజమాన్యం తగిన సహకారం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ తొల్పునూరి చంద్రశేఖర్, వైస్‌ప్రిన్సిపాల్‌ వి,దేవేందర్‌రావ్,అధ్యాపకులు కె.సుధాకర్, జి.శ్రీను, ఎం.వెంకటేశ్వర్లు, బి.మహేష్, డి.ప్రభాకర్, ఇ.జ్ఞానేశ్వరి, ఎండీ ముజాహిద్, ఎ.మల్లికార్జున్,కె. ప్రశాంత్‌రెడ్డి, సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, వి.మమత పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement