కేసీ కాల్వకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల | water relese to kc cenal | Sakshi
Sakshi News home page

కేసీ కాల్వకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల

Sep 21 2016 7:55 PM | Updated on Sep 4 2017 2:24 PM

కేసీ కాల్వకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల

కేసీ కాల్వకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల

సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వకు 2,600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్‌ తెలిపారు.

జూపాడుబంగ్లా: సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వకు 2,600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో  సుంకేసుల జలాశయంలోకి 2,800క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతోందన్నారు. అందులో 2,600క్యూసెక్కుల నీటిని కేసీ కాల్వకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీ కాల్వకు సరఫరా అయ్యే నీటిలో అలగనూరు రిజర్వాయర్‌కు 900, నిప్పులవాగుకు 700, తూడిచెర్ల సబ్‌చానల్‌కు 200క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేSసీ కాల్వకు కేటాయించిన 3టీఎంసీల నీటిలో ఇప్పటిదాకా3000 క్యూసెక్కులు మాత్రమే వాడుకున్నట్లు ఆయన తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement