హెచ్చెల్సీకి నీటి విడుదల | water release of hlc | Sakshi
Sakshi News home page

హెచ్చెల్సీకి నీటి విడుదల

Aug 30 2017 11:15 PM | Updated on Sep 17 2017 6:09 PM

హెచ్చెల్సీకి నీటి విడుదల

హెచ్చెల్సీకి నీటి విడుదల

జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కాలువకు బుధవారం తుంగభద్ర మండలి అధికారులు నీటిని వదిలారు.

బొమ్మనహాళ్‌/హోస్పేట: జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కాలువకు బుధవారం తుంగభద్ర మండలి అధికారులు నీటిని వదిలారు. హెచ్చెల్సీ కాలువకు సంబంధించిన రెండు గేట్లకు తుంగభద్ర మండలి కార్యదర్శి డి.రంగారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పి.లక్ష్మప్ప, అసిస్టెంట్‌ కార్యదర్శి రమేష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం గేట్లకు సంబంధించిన స్విచ్‌ ఆన్‌ చేసి కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రారంభంలో వంద క్యూసెక్కుల వరకు నీటిని వదిలారు. గంట గంటకు వంద క్యూసెక్కుల వరకు నీటి సామర్థ్యాన్ని పెంచుతూ మొత్తం 500 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా మండలి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తుంగభద్ర మండలి ఇంజినీర్‌ శ్రీనివాస నాయక్, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement