పశు వైద్య విద్యార్థుల సమ్మె విరమణ | veterinary strike call off | Sakshi
Sakshi News home page

పశు వైద్య విద్యార్థుల సమ్మె విరమణ

Sep 3 2016 11:20 PM | Updated on Sep 4 2017 12:09 PM

పశు వైద్య విద్యార్థుల సమ్మె విరమణ

పశు వైద్య విద్యార్థుల సమ్మె విరమణ

ఏపీపీఎస్సీ ద్వారా పశు వైద్యుల పోస్టులు భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల విద్యార్థులు 25 రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం విరమించారు.

గన్నవరం :
 ఏపీపీఎస్సీ ద్వారా పశు వైద్యుల పోస్టులు భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల విద్యార్థులు 25 రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం విరమించారు. విద్యార్థుల ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా పాత పద్ధతిలో డిపార్ట్‌మెంట్‌ సెలక్షన్‌ ద్వారా నియామకాలు జరిపేందుకు హామీ ఇచ్చింది. కళాశాల అసోసియేట్‌ ఇన్‌చార్జి డీన్‌ డాక్టర్‌ జి. శ్రీనివాసరావును కలిసిన విద్యార్థులు సమ్మె విరమణ నోటీసును అందజేశారు. తమ డిమాండ్‌ పరిష్కరానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు, ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.  విద్యార్థి సంఘ నాయకులు జి. సుబాష్‌చంద్రబోస్, ఎన్‌. శివరామకృష్ణ, సాయిసతీష్‌రాజు, ఫణికుమార్, గోపినాథ్, సుమంత్‌రెడ్డి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.·
 

Advertisement

పోల్

Advertisement