తెల్లవార్లూ కోడిపందేలు | upto morning henbettings | Sakshi
Sakshi News home page

తెల్లవార్లూ కోడిపందేలు

Jan 18 2017 12:30 AM | Updated on Sep 5 2017 1:26 AM

తెల్లవార్లూ కోడిపందేలు

తెల్లవార్లూ కోడిపందేలు

జంగారెడ్డిగూడెం : సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగో రోజు రాత్రి ప్రారంభమైన కోడిపందేలు తెల్లవార్లూ పెద్దెత్తున ఫ్లడ్‌లైట్ల వెలుతురులో యథేచ్ఛగా సాగాయి.

జంగారెడ్డిగూడెం : సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగో రోజు రాత్రి ప్రారంభమైన కోడిపందేలు తెల్లవార్లూ పెద్దెత్తున ఫ్లడ్‌లైట్ల వెలుతురులో యథేచ్ఛగా సాగాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము వరకు కోడిపందాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కొన్ని కోడిపందాల వద్దకు పోలీసులు వెళ్లినా కోడిపందాల నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. మంత్రులు, ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ పందాలు నిర్వహించినట్టు సమాచారం. గతంలో భోగి, సంక్రాంతి, కనుమ రోజు మాత్రమే నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం ముక్కమనాడు కూడా పందేలు నిర్వహించడం విశేషం. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement