ఆ రహస్యం ఏంటో చెప్పాలి: ఉండవల్లి | undavalli arun kumar demands chadrababu explain tha secreat of special package | Sakshi
Sakshi News home page

ఆ రహస్యం ఏంటో చెప్పాలి: ఉండవల్లి

Jan 6 2017 2:02 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆ రహస్యం ఏంటో చెప్పాలి: ఉండవల్లి - Sakshi

ఆ రహస్యం ఏంటో చెప్పాలి: ఉండవల్లి

చంద్రబాబు నాయుడు మాటల వెనుక రహస్యం ఏమిటో ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

రాజమండ్రి : తాను రాజీ పడకపోతే పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చేవి కావంటున్న చంద్రబాబు నాయుడు మాటల వెనుక రహస్యం ఏమిటో ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఏంటనేది కూడా ఇప్పటివరకూ స్పష్టం కాలేదన్నారు.  ప్యాకేజీ గురించి ముందే తెలిసుంటే డ్రామలెందుకని ఉండవల్లి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామంటునే పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులెందుకని ప్రశ్నించారు.

చదవండి: (పోలవరం కోసమే ప్యాకేజీకి ఓకే)

పట్టిసీమ పేరుతో రూ.1600 కోట్లను చంద్రబాబు గోదావరిలో కలిపేశారని ఉండవల్లి విమర్శించారు. ఈ ప్రాజెక్టు విషయంలో తొమ్మిదిసార్లు ప్రభుత్వానికి తాను లేఖ రాశానని, ఎటువంటి స్పందన లేదని ఆయన అన్నారు. పోలవరం కుడి కాల్వలో ఇచ్చిన పరిహారం, పురుషోత్తపట్నం ప్రాజెక్టులో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈ పేరుతో మరో రూ.1600 కోట్లను సముద్రంలో కలుపుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement