
గుర్తుతెలియని వ్యక్తి మృతి
రాయచోటి పట్టణ పరిధిలోని పాత రాయచోటి శివాలయం సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
రాయచోటి రూరల్: రాయచోటి పట్టణ పరిధిలోని పాత రాయచోటి శివాలయం సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అతనికి 55 ఏళ్లు ఉండవచ్చని వారు తెలిపారు. తల, తోడలకు గాయాలు ఉన్నట్లు సమాచారం. విషయం తెలియగానే ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం రాయచోటి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.