పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు | two students appeared 10th exam, even after their father died | Sakshi
Sakshi News home page

పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు

Mar 28 2016 10:04 PM | Updated on Sep 3 2017 8:44 PM

పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరై తండ్రుల ఆశయాలను నెరవేర్చారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు.

రావుకుప్పం/యాదమరి(చిత్తూరు జిల్లా): పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరై తండ్రుల ఆశయాలను నెరవేర్చారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు. యాదమరి మండలం వరదరాజలుపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి ఆదివారం సాయంత్రం మరణించాడు. అతని కుమార్తె చేతన సోమవారం పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరై తండ్రి ఆశయాలను నెరవేర్చింది.

అలాగే రావుకుప్పం వుండలం పల్లికుప్పం గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమారుడు కార్తీక్ పదోతరగతి చదువుతున్నాడు. కార్తీక్ తండ్రి సోమవారం హఠాత్తుగా మరణించాడు. కానీ ఈ విషయాన్ని విద్యార్థికి తెలియనీయకుండా అధికారులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. పరీక్ష రాసిన తర్వాత విషయం తెలుసుకున్న కార్తీక్ బోరున విలపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement