తండేల్ మూవీ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య(Naga chaitanya) భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీ కోసం కార్తీక్ దండుతో ఆయన జతకట్టారు. చైతూ కెరీర్‌లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్‌సీ24(NC24) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అడ్వంచరస్ మైథాలజీ చిత్రంగా రానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ అడ్వెంచరస్ మూవీలో దక్ష పాత్రలో మెప్పించనుంది. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తుంటే పురావస్తు శాఖలో శాస్త్రవేత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలోనూ ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సారి మరో డిఫరెెంట్ రోల్‌తో అభిమానులను అలరించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. 
 
Super excited to be a part of this team and to Be playing ‘DAKSHA’ . Get ready for a an exciting journey 🥰 https://t.co/NsfGkrI71X
— Meenaakshi Chaudhary (@Meenakshiioffl) November 4, 2025

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
