చెట్టును ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి | Two killed in road accident in vizag city | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి

Sep 28 2016 6:42 AM | Updated on Aug 30 2018 4:10 PM

నగరంలోని స్టీల్ ప్లాంట్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చెట్టును కారు ఢీకొట్టింది.

విశాఖపట్నం : నగరంలోని స్టీల్ ప్లాంట్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement