ఆంధ్ర సరిహద్దు చేరిన ఎల్లెల్సీ నీరు | tunga water flow in to andhra | Sakshi
Sakshi News home page

ఆంధ్ర సరిహద్దు చేరిన ఎల్లెల్సీ నీరు

Jul 25 2016 11:36 PM | Updated on Sep 4 2017 6:14 AM

ఆంధ్ర సరిహద్దు చేరిన ఎల్లెల్సీ నీరు

ఆంధ్ర సరిహద్దు చేరిన ఎల్లెల్సీ నీరు

తుంగభద్ర డ్యాం నుంచి దిగువకాల్వకు విడుదలైన నీరు ఆదివారం రాత్రికి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని 135వ మైలురాయిని దాటాయి.

హాలహర్వి : తుంగభద్ర డ్యాం నుంచి దిగువకాల్వకు విడుదలైన నీరు ఆదివారం రాత్రికి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని 135వ మైలురాయిని దాటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులు సోమవారం తుంగభద్ర జలాలకు పూజలు చేశారు. ఈ నెల 18వ తేదీన తుంగభద్ర డ్యాం అధికారులు ఆంధ్రాకు తాగునీటి అవసరాల నిమిత్తం 690 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే కర్ణాటకలోని 6వ కి.మీ. వద్ద కాలువకు ఓ చోట గండి పడడంతో నీటిని నిలుపుదల చేశారు. గండిని పూడ్చేందుకు అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజులక్రితం గండి పూడ్చడం పూర్తయిన తర్వాత తిరిగి నీట విడుదలను కోనసాగించారు. ఆ నీరే ప్రస్తుతం దిగువ కాలువకు చేరిందని ఆంధ్రసరిహద్దు ఎల్లెల్సీ డీఈ నెహేమియా సోమవారం విలేకరులకు తెలిపారు. డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు చేరితే సాగునీటిని కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement