15న విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు | traffic restrictions in visakhapatnam | Sakshi
Sakshi News home page

15న విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

Nov 14 2015 12:52 AM | Updated on May 3 2018 3:17 PM

15న విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు - Sakshi

15న విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నెల 15న విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించనున్న ఆఫ్ మారథాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం: ఈ నెల 15న విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించనున్న ఆఫ్ మారథాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు రిషికొండ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ఆఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆ సమయంలో ఇక్కడ వాహనాల రాకపోకలను అనుమతించబోమని వారు వెల్లడించారు. త్రిపుర జంక్షన్, సీఆర్రెడ్డి జంక్షన్, ఏయూ ఇన్ గేట్ నుంచి హైస్కూలు రోడ్డులో ఖాళీ ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలు కల్పించనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement