టవర్‌పై నుంచి జారిపడి ఏడీఈ మృతి | towar | Sakshi
Sakshi News home page

టవర్‌పై నుంచి జారిపడి ఏడీఈ మృతి

Oct 30 2016 12:05 AM | Updated on Sep 4 2017 6:41 PM

బట్టేలంక (మలికిపురం):గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చెల్లుబోయిన నరసింహమూర్తి కుమారుడు రమేష్‌కుమార్‌ (32) శనివారం ఉదయం కాలువలో పడి మృతి చెందాడు. ముఖం కడుక్కుంటుండగా ముందుకు పడిపోయి ఆయన చనిపోయాడు.రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పారిశ్రామికవేత్త కేవీ చంటిరాజు, సర్పంచ్‌ కందికట్ల కమళామణి, సొసైటీ అధ్యక్షుడు బండారు విజయకుమార్, ఎంపీటీసీ సభ్యుడు బోనం ఏసు తదితరులు సంతాపం తెలిపారు.

డొంకరాయి (మోతిగూడెం) :
విద్యుత్‌ టవర్‌పై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి జారి కిందపడి ఏపీ ట్రా¯Œ్సకో ఏడీఈ రోహిణీకుమార్‌ (40) శనివారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.  వై.రామవరం మండలం డొంకరాయి సమీపంలోని గంగవాడ వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ టవర్‌ మరమ్మతుకు గురైంది. తన సిబ్బందితో అక్కడకు వెళ్లిన రోహిణీకుమార్‌  టవర్‌ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా  ప్రమాదవశాత్తూ జారికింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను సిబ్బంది డొంకరాయి హాస్పటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై డొంకరాయి ఎస్‌సై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.  
కాలువలో పడి వ్యక్తి మృతి

Advertisement
 
Advertisement
Advertisement