breaking news
Donkarai
-
టవర్‌పై నుంచి జారిపడి ఏడీఈ మృతి
డొంకరాయి (మోతిగూడెం) : విద్యుత్ టవర్‌పై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి జారి కిందపడి ఏపీ ట్రా¯Œ్సకో ఏడీఈ రోహిణీకుమార్ (40) శనివారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వై.రామవరం మండలం డొంకరాయి సమీపంలోని గంగవాడ వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ టవర్ మరమ్మతుకు గురైంది. తన సిబ్బందితో అక్కడకు వెళ్లిన రోహిణీకుమార్ టవర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారికింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను సిబ్బంది డొంకరాయి హాస్పటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై డొంకరాయి ఎస్సై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. కాలువలో పడి వ్యక్తి మృతి బట్టేలంక (మలికిపురం):గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చెల్లుబోయిన నరసింహమూర్తి కుమారుడు రమేష్‌కుమార్ (32) శనివారం ఉదయం కాలువలో పడి మృతి చెందాడు. ముఖం కడుక్కుంటుండగా ముందుకు పడిపోయి ఆయన చనిపోయాడు.రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పారిశ్రామికవేత్త కేవీ చంటిరాజు, సర్పంచ్ కందికట్ల కమళామణి, సొసైటీ అధ్యక్షుడు బండారు విజయకుమార్, ఎంపీటీసీ సభ్యుడు బోనం ఏసు తదితరులు సంతాపం తెలిపారు. -
8 మంది సిబ్బంది, 150 మంది పోలీసులు.. ఒకే ఒక్క ఓటరు
డొంకరాయి (వై.రామవరం) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ నిమిత్తం వై.రామవరం మండలం డొంకరాయిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ సిబ్బంది (8 మంది) ఆదివారం ఉదయం 8 గంటలకే విధి నిర్వహణకు సిద్ధమయ్యూరు. పోలింగ్ కేంద్రం బయట తుపాకులతో భారీ పోలీసు బందోబస్తూ ఉంది. అంతేకాక.. మావోయిస్టులు ఎక్కడ పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కల్పిస్తారోనన్న అనుమానంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో యూంటీ నక్సల్ స్క్వాడ్ తదితర బలగాలు గాలింపునూ చేపట్టాయి. మొత్తం మీద పోలింగ్ కేంద్రం వద్ద, అటవీ ప్రాంతంలో సుమారు 150 మంది పోలీసులు ఉన్నారు. అయితే మధ్యాహ్నం 2.30 గంటల వరకూ డొంకరాయి పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటూ పోలవలేదు. సరిగ్గా ఆ సమయంలో ఒక ఓటరు వచ్చి ఓటేశారు. అంతే.. ఆ కేంద్రంలో పోలింగ్ ముగిసిపోయింది. 8 మంది సిబ్బందీ బ్యాలట్బాక్సుకు సీలు వేసి, తాము వచ్చిన ప్రత్యేక బస్సులో తిరుగు ముఖం పట్టారు. వై.రామవరంలోనే ఏర్పాటు చేయొచ్చు.. ‘ఇదేమిటి.. ఒక్కరు ఓటేయగానే పోలింగ్ ముగియడమేమిటి?’ అనుకుంటున్నారా! అవును.. అక్కడ ఓటేసేది ఆయనొక్కరే. అది ముందే తెలిసినా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యూంత్రిక నిర్వాకం పర్యవసానమే ఇదంతా. డొంకరాయిలో 5 ఉపాధ్యాయ ఓట్లు ఉండగా, వారిలో ఒకరు ఏడాది క్రితం మృతి చెందారు. మరొకరు రిటైరై మైదాన ప్రాంతంలో స్థిరపడ్డారు. మరో ఇద్దరు బదిలీపై వెళ్ళిపోయారు. మిగిలిన ఒక్కరూ అక్కడి జెడ్పీ హైస్కూలులో హెచ్ఎంగా పని చేసిన కె.ప్రసాదబాబుది. ప్రస్తుతం డొంకరాయి స్కూలులో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో ఇద్దరికే ఓటు హక్కుండగా మిగిలిన వారు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారు కావడంతో ఓటు హక్కు లేదు. ఆ హక్కున్న ఇద్దరూ వై.రామవరం నుంచి బదిలీ కాగా.. వారి ఓట్లు ఇంకా అక్కడి పోలింగ్ కేంద్రంలోనే ఉన్నాయి. వై.రామవరం నుంచి డొంకరాయి సుమారు 175 కిలోమీటర్లు. అదీ కొండల్ని చుట్టుకుని అరుుదుమండలాల మీదుగా ప్రయూణించాలి. ప్రసాదబాబు వై.రామవరం నుంచి ఉదయం మోటారు బైక్‌పై బయలుదేరి అష్ట కష్టాలు పడి, డొంకరాయి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకే ఒక్క ఓటు కోసం ఒక బస్సు ఏర్పాటు చేయడం, ఎన్నికల సిబ్బందిని తరలించడం, పోలీసుల్ని మోహరించడం అధికారుల యూంత్రికమైన పనితీరుకు సాక్ష్యం. ఆ పోలింగ్ కేంద్రంలో ఓటేయూల్సిన ప్రసాదబాబు వై.రామవరంలో ఉంటారు. ఆ పోలింగ్‌ను కూడా వై.రామవరం కేంద్రంలోనే నిర్వహిస్తే అటు ప్రభుత్వానికి వేలాది రూపాయల ఖర్చు, పోలింగ్ సిబ్బందికి, పోలీసులకు, ‘ఒక్కగానొక్క ఓటరు’ ప్రసాదబాబుకూ ప్రయూసా తప్పి ఉండేవి.