ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) టి.వి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు.
రేపు జాబ్‌మేళా
May 6 2017 11:35 PM | Updated on Sep 5 2017 10:34 AM
	– డీవీఈవో సుబ్రమ్మణేశ్వరరావు వెల్లడి
	 
					
					
					
					
						
					          			
						
				
	కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) టి.వి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. ఇదే అంశంపై శనివారం స్థానిక ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2014 నాటికి ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన  అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్‌మేళాకు అర్హులన్నారు. వివిధ కంపెనీలు పాల్గొంటున్నందున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఆధార్‌కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తెచ్చుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, పారా మెడికల్, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశమన్నారు. బీక్యాంప్‌లోని ప్రభుత్వ ఒకేషనల్ వృత్తి విద్య కళాశాలలో ఉదయం 10.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, అభ్యర్థులు ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డిప్యూటీ డీవీఈఓ కె.వెంకట్రావ్, వృత్తి విద్య కోర్సుల ప్లేస్‌మెంట్ అధికారి బి.వి.మాధవరావు కూడా హాజరయ్యారు.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
