పీడిత ప్రజల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 16న ఏలూరులో జరపనున్నామని జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చలమోలు అశోక్‌గౌడ్ అన్నారు.
రేపు గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ
Aug 15 2016 12:39 AM | Updated on Jul 12 2019 4:35 PM
ఏలూరు రూరల్ : పీడిత ప్రజల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 16న ఏలూరులో జరపనున్నామని జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చలమోలు అశోక్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఏలూరు ఆదివారపుపేటలో జరిగిన సంఘం సమావేశ వివరాలను ఆయన వెల్లడించారు. జమిందారీ వ్యవస్థ రద్దు కోసం 1938లో 1,100 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత లచ్చన్నదేనని గుర్తు చేశారు. లచ్చన్న విగ్రహ ప్రతిష్టకు జిల్లా నలుమూలల నుంచి సంఘీయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శంకా బాలయోగి, డి.సుధాకర్, పీపీఎన్ చంద్రరావు, ఎం.పెంటయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement