ప్రత్యేక హోదా కోసం రేపు కొవ్వొత్తుల ప్రదర్శన | tomorrow candels rally | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం రేపు కొవ్వొత్తుల ప్రదర్శన

Jan 25 2017 12:13 AM | Updated on Sep 5 2017 2:01 AM

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26 సాయంత్రం 5.30 గంటలకు కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. మంగళవారం సాయంత్ర

కాకినాడ రూరల్‌ : 
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26 సాయంత్రం 5.30 గంటలకు కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. మంగళవారం సాయంత్ర రమణయ్యపేటలోని తన నివాస గృహంలో విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలంతా కేంద్రాన్ని ఒప్పించే విధంగా పార్టీలకతీతంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు యువతీ, యువకులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు మద్దతు తెలిపి కొవ్వొత్తుల ప్రదర్శనలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు వైఎస్సార్‌ బ్రిడ్జి వద్ద  వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీగా భానుగుడి జంక్ష¯ŒSకు చేరుకొని  ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.
రంపచోడవరం : గురువారం కాకినాడ లో జరగనున్న కొవ్వొత్తుల ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు అనంతబాబు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement