రేపు ఎస్వీయూలో ఉద్యోగ మేళా | tommarow jobmela in svu | Sakshi
Sakshi News home page

రేపు ఎస్వీయూలో ఉద్యోగ మేళా

Jul 28 2016 11:12 PM | Updated on Sep 4 2017 6:46 AM

హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్‌ కంపెనీ ప్రతినిధులు ఎస్వీయూలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ మేడసాని దేవరాజులు ఒక ప్రకటనలో తెలిపారు.

 
తిరుపతి అర్బన్‌: హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్‌ కంపెనీ ప్రతినిధులు ఎస్వీయూలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ మేడసాని దేవరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. 2015, 2016 విద్యా సంవత్సరాల్లో వైరాలజీ, మైక్రో బయాలజీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మేటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ మేళా శనివారం ఉదయం 9:30 నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫీస్‌లో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్స్, ఓరల్‌ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement