నేడు చెన్నైలో సత్యదేవుని సామూహిక వ్రతాలు | today satyadeva vrathalu in chennai | Sakshi
Sakshi News home page

నేడు చెన్నైలో సత్యదేవుని సామూహిక వ్రతాలు

Apr 13 2017 11:58 PM | Updated on Sep 5 2017 8:41 AM

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో శుక్రవారం శ్రీ సత్యదేవుని సామూహిక వ్రతాలు నిర్వహించేందుకు అన్నవరం దేవస్థానానికి చెందిన పదిమంది పురోహితులు, అధికారుల బృందం బయల్దేరి వెళ్లింది. చెన్నైలోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఈ వ్రతాలు నిర్వహించేందుకు

  • ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
  • పూజా సామగ్రితో చెన్నై చేరిన పురోహిత బృందం
  • అన్నవరం (ప్రత్తిపాడు) : 
    తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో శుక్రవారం శ్రీ సత్యదేవుని సామూహిక వ్రతాలు నిర్వహించేందుకు అన్నవరం దేవస్థానానికి చెందిన పదిమంది పురోహితులు, అధికారుల బృందం బయల్దేరి వెళ్లింది. చెన్నైలోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఈ వ్రతాలు నిర్వహించేందుకు పురోహితులను, సత్యదేవుడు, అమ్మవార్ల నమూనా మూర్తులను, పూజాసామగ్రిని పంపించాలని గత నెలలో దేవస్థానానికి దరఖాస్తు చేసింది. దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావుతో కూడిన పాలకవర్గం ఈ వినతిని అంగీకరించింది. దీంతో చెన్నయ్‌లోని టి.నగర్‌ ఉస్మా¯ŒSరోడ్‌లో గల రామకృష్ణా స్కూల్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం 7–30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నాలుగు బ్యాచ్‌లుగా ఈ వ్రతాలు నిర్వహించనున్నారు. సుమారు వేయి మంది భక్తులు ఈ వ్రతాలు ఆచరిస్తారని భావిస్తున్నట్టు నిర్వాహకులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. కాగా, అన్నవరం దేవస్థానం నుంచి చెన్నయ్‌ వెళ్లిన పురోహిత బృందంలో స్పెషల్‌ గ్రేడ్‌ వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ శర్మ, ప్రథమశ్రేణి పురోహితులు కర్రి వైకుంఠం, ఛామర్తి సత్యనారాయణ తదితరులున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement