నేటితో ముగియనున్న ఎంసెట్‌ కౌన్సెలింగ్ | today eamcet counseling ends | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న ఎంసెట్‌ కౌన్సెలింగ్

Jun 17 2017 12:29 AM | Updated on Sep 5 2017 1:47 PM

ఈనెల 8న ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నేటితో ముగియనుంది.

నంద్యాల అర్బన్‌: ఈనెల 8న ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నేటితో ముగియనుంది.   స్థానిక ఈఎస్సీ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తున్న  కౌన్సెలింగ్‌ను శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్‌ విజయభాస్కర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం  1,30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారన్నారు. 17, 18 తేదీల్లో 90,001 ర్యాంకు నుంచి 1,20,000, 19, 20 తేదీల్లో 1,20,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. 21, 22తేదీల్లో ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 25న కోర్సులు, సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement