భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి | Sakshi
Sakshi News home page

భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి

Published Sat, Aug 13 2016 6:20 PM

భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి

భువనగిరి అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ నిర్మాణాల్లో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వేముల మహేందర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు 123 జీఓను కొట్టివేసిన తిరిగి మళ్లీ ఆ జీఓపై కోర్టుకు అప్పీలు చేస్తూ రైతులకు, నిర్వాసితులకు నష్టం కలిగించే విధానాలు ప్రభుత్వం అవలంబిస్తున్నట్లు చెప్పారు. అలాగే గత 4 నెలలుగా ఉపాధి కూలీలకు పని చేసిన వేతనాలు రావటం లేదని ఇప్పటికైన వెంటనే చెల్లించాలన్నారు. 2వ ఏఎన్‌ఎంలు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో డివిజన్‌ అధ్యక్షుడు పల్లేర్ల అంజయ్య, డివిజన్‌ నాయకులు దయ్యాల నర్సింహ,  మండలశాఖ అధ్యక్షుడు ఎస్‌. ఎల్లయ్య, నాయకులు రవి, ప్రభాకర్, కిషన్, భిక్షపతి పాల్గొన్నారు.    
 

Advertisement
Advertisement