రేపు తిరంగా యాత్ర | Tirangā trip tomorrow | Sakshi
Sakshi News home page

రేపు తిరంగా యాత్ర

Sep 15 2016 1:44 AM | Updated on Sep 4 2017 1:29 PM

అవస్యు ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన హన్మకొండలో తిరంగాయాత్రను నిర్వహించనున్నట్లు అవస్యు వ్యవస్థాపకుడు జె.సుర్జీత్, సహ వ్యవస్థాపకురాలు కె.వసుధ తెలిపారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తిరంగా యాత్ర శుక్రవారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగుతోందని చెప్పారు.

హన్మకొండ : అవస్యు ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన హన్మకొండలో తిరంగాయాత్రను నిర్వహించనున్నట్లు అవస్యు వ్యవస్థాపకుడు జె.సుర్జీత్, సహ వ్యవస్థాపకురాలు కె.వసుధ తెలిపారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తిరంగా యాత్ర శుక్రవారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగుతోందని చెప్పారు. భారత దేశానికి బ్రిటిష్‌ దాస్య శృంఖలాల నుంచి విముక్తి జరిగి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి జరిగి 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నాటి పోరాటయోధులను గుర్తుకు తెచ్చుకుని రాబోయే తరానికి తెలియజేసేందుకే తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాలీని నెహ్రూ యువ సంఘట¯ŒS ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement