నకిలీ నోట్ల కేసులో ముగ్గురిపై కేసు నమోదు
నకిలీ నోట్ల కేసులో పెద్ద నెలటూరు గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదైంది. గురువారం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి కేసు వివరాలను వెల్లడించారు.
గోనెగండ్ల: నకిలీ నోట్ల కేసులో పెద్ద నెలటూరు గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదైంది. గురువారం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి కేసు వివరాలను వెల్లడించారు. పెద్ద నెలటూరు గ్రామానికి చెందిన షేక్ సుభాన్ ఈనెల 4వ తేదీన తన సమీప బంధువు జిరాక్స్ షాప్‌లో రూ. 2 వేల నోటును కలర్ జిరాక్స్ కాపీలను చేశాడు. వాటిని చెలామణి చేసేందుకు తన మిత్రులు అదే గ్రామానికి ఈడిక ఖాజన్న, గొల్ల గోవిందు సహకారం తీసుకున్నాడు. ముందుగా వారు గ్రామంలోని బెల్ట్‌షాప్ వద్దకు వెళ్లారు. మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి నకిలీ నోటు ఇవ్వగా బెల్ట్ షాప్ నిర్వాహకుడు గుర్తించి వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ నోటును చిచ్చివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు గోనెగొండ్ల ఎస్‌ఐ కృష్ణమూర్తి విచారణ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.