ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు | three injured of auto rolls | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

Sep 7 2017 10:04 PM | Updated on Mar 9 2019 4:28 PM

కళ్యాణదుర్గం – కంబదూరు ప్రధాన రహదారిలో కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలోని కొత్త మారెమ్మ ఆలయం వద్ద గురువారం రాత్రి అడవి పంది రోడ్డుకు అడ్డురావడంతో దాన్ని ఢీ కొన్న డీజిల్‌ ఆటో బోల్తా పడింది.

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం – కంబదూరు ప్రధాన రహదారిలో కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలోని కొత్త మారెమ్మ ఆలయం వద్ద గురువారం రాత్రి అడవి పంది రోడ్డుకు అడ్డురావడంతో దాన్ని ఢీ కొన్న డీజిల్‌ ఆటో బోల్తా పడింది. దీంతో ముగ్గురుకి గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం నుంచి డ్రైవర్‌ మాధవయ్య యర్రంపల్లి గ్రామానికి చెందిన శివ వెంకటేశులను ఎక్కించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు.  మార్గంమధ్యంలోని కొత్త మారెమ్మ ఆలయం వద్దకు రాగానే ఉన్నఫలంగా అడవి పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దీంతో డీజిల్‌ ఆటో అదుపుతప్తి బోల్తా పడగా శివకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. వెంకటేశులు, డ్రైవర్‌ మాధవయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్య చికిత్సల కోసం శివను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement