ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురు డీబార్‌ | three debar in inter exams | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురు డీబార్‌

Mar 9 2017 12:04 AM | Updated on Jun 1 2018 8:39 PM

ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డీబార్‌ అయ్యారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి సంవత్సరం గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డీబార్‌ అయ్యారు. అమరాపురం  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో ఒకరు, కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు కాపీలు కొడుతూ  పట్టుబడటంతో డీబార్‌ చేశారు. మొత్తం 27,428 మంది విద్యార్థులకు గానూ 26,485 మంది విద్యార్థులు హాజరయ్యారు. 943 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 24,432 మందికి గానూ 23,687 మంది హాజరయ్యారు. 745 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌ విద్యార్థులు 2,996 మందికి గానూ 2798 మంది హాజరయ్యారు. 198 మంది గైర్హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement