కానిస్టేబుల్‌ ఇంట్లోనే చోరీ | theft at Constable home | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఇంట్లోనే చోరీ

Aug 7 2016 8:56 PM | Updated on Mar 19 2019 5:52 PM

కానిస్టేబుల్‌ ఇంట్లోనే చోరీ - Sakshi

కానిస్టేబుల్‌ ఇంట్లోనే చోరీ

తాళం వేసి ఊరికి వెళ్లిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో దొంగలు 3.5 తులాల ఎత్తుకెళ్లారు.

బోడుప్పల్‌: తాళం వేసి ఊరికి వెళ్లిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో దొంగలు పడి 3.5 తులాల బంగారు నగలు, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు.  ఆదివారం మేడిపల్లి ఎస్‌ఐ నవీన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్‌ టెలిఫోన్‌ కాలనీలో నివసించే కానిస్టేబుల్‌ ఉమాకుమార్‌ ఏసీపీ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 5న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్‌ వెళ్లాడు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కనిపించలేదు. మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement