వేములపల్లి : వరంగల్ జిల్లా పరకాలలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్యని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం అన్నారు.
వేములపల్లి : వరంగల్ జిల్లా పరకాలలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్యని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్‌ఆర్ పేద ప్రజలు, రైతులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో కషిచేశాడని అలాంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఆయన వెంట వేములపల్లి, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు పెద్దమామ్ సైదులు, పిల్లుట్ల బ్రహ్మం, నాయకులు మొండి సైదిరెడ్డి, బొబ్బిలి శ్రీను, పోరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.