రామాయంపేట మండల శివారులో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.
రామాయంపేట మండల శివారులో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు నార్సింగి గ్రామానికి చెందిన గంగారపు రాములు(35)గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు రాములు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన రాత్రి జరిగి ఉండవచ్చు. స్థానికులు గురువారం ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.