హన్మకొండలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
-
∙జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
గురవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి, సాంప్రదాయాలు, సంస్కృతి ప్రతిభింబించే విధంగా 30 నిమిషాల నిడివిలో నాలుగు పాటలు ఉండేవిధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. బారీ కేడింగ్, తాగునీరు, కుర్చిల ఏర్పాటు విషయంలో వీక్షకులకు, అతిథులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, వైద్యారోగ్య, మిషన్ భగీరథ, మహిళా శిశు సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖలు స్టాళ్ల ఏర్పాటు, శకటాలు ప్రదర్శించాలని అన్నారు. సమావేశంలో డీఆర్వో శోభ, డీపీఆర్వో శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.