అప్పీల్‌ లేని అంతిమ తీర్పు | The final judgment without appeal | Sakshi
Sakshi News home page

అప్పీల్‌ లేని అంతిమ తీర్పు

Apr 5 2017 1:38 AM | Updated on Sep 5 2017 7:56 AM

అప్పీల్‌ లేని అంతిమ తీర్పు

అప్పీల్‌ లేని అంతిమ తీర్పు

కక్షిదారులు రాజీమార్గంలో లోక్‌ అదాలత్‌లో చేసుకున్న తీర్పు అప్పీల్‌ లేని అంతిమ తీర్పు అని జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌

జిల్లా ప్రధాన జడ్జి తిరుమలదేవి
ఈనెల 8న  జాతీయ లోక్‌ అదాలత్‌


వరంగల్‌ లీగల్‌ : కక్షిదారులు రాజీమార్గంలో లోక్‌ అదాలత్‌లో చేసుకున్న తీర్పు అప్పీల్‌ లేని అంతిమ తీర్పు అని జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కమ్‌ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ ఈద తిరుమలదేవి అన్నారు. మంగళవారం జిల్లా న్యా యసేవా సదన్‌ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 8న నిర్వహిస్తున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆర్థికభారాన్ని తగ్గిం చుకోవడానికి విలువైన సమయాన్ని కాపాడుకోవడానికి కక్షిదారులు రా జీమార్గాన్ని ఆశ్రయించాలన్నా రు. దేశవ్యాప్తంగా జాతీయ న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 8న జాతీయ లోక్‌ అదాలత్‌  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే సంబంధిత కక్షిదారులకు నోటీసులు జారీచేసినట్లు చెప్పారు. కేసులు నమోదు కాని ప్రిలిటిగేషన్‌ కేసులు 400 సైతం పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో అదనపు జిల్లా జడ్జి కె.రమేష్, సీనియర్‌ సివిల్‌ జడ్జి వై.పద్మ, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులతో కూడిన 11 బెంచ్‌లో ఏర్పాటు చేసినట్లు, మహబూబాబాద్‌–3, ములుగు–2, జనగామ–3, పరకాల–2, నర్సంపేట, తొర్రూరు కోర్టుల్లో ఒక బెంచ్‌ చొప్పున ఏర్పాటు చేసి లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జడ్జి తిరుమలదేవి తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement