నేటి నుంచి తైక్వాండో పోటీలు | thaiquando games start today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి తైక్వాండో పోటీలు

Nov 26 2016 11:24 PM | Updated on Sep 4 2017 9:12 PM

జిల్లా స్థాయి తైక్వాండో క్రీడాపోటీలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : జిల్లా స్థాయి తైక్వాండో క్రీడాపోటీలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తైక్వాండో అసోసియేషన్‌  జిల్లా అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. క్రీడా పోటీలు స్థానిక ఇండోర్‌ స్టేడియంలో జరుగనున్నట్లు చెప్పారు. ఓపెన్‌ సబ్‌–జూనియర్, క్యాడెట్, జూనియర్స్, సీనియర్స్‌ విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి  ఉన్న క్రీడాకారులు ఈనెల 27న ఉదయం 9 గంటలకు ఇండోర్‌ స్టేడియంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ : 7382440946లో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement