మన్యంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు | Temperatures have fallen heavily in manyam | Sakshi
Sakshi News home page

మన్యంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Dec 27 2015 8:29 AM | Updated on Sep 3 2017 2:40 PM

విశాఖ ఏజెన్సీ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు ఆదివారం మరింతగా పడిపోయాయి.

విశాఖ ఏజెన్సీ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు ఆదివారం మరింతగా పడిపోయాయి. లంబసింగిలో ఆదివారం ఉదయం 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 6 డిగ్రీలుగా ఉంది. ఇక పాడేరు, మోదపల్లిలో 7 డిగ్రీలు నమోదైంది. లంబసింగిలో శనివారం ఉదయం 7 డిగ్రీల ఉష్ణోగ్రత, చింతపల్లిలో 10 డిగ్రీలు ఉండగా ఆదివారం ఉదయం నాటికి బాగా తగ్గినట్టు తెలుస్తోంది. చలి గాలులు, మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 20 అడుగుల దూరంలో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది.


 

Advertisement
 
Advertisement
Advertisement